BANCI(Telugu)-2020

జన గణన (BANCI 2020) గురించి మలేషియా తెలుగు సంఘం వారందించే తాజా వివరాలు భాగం-1

ప్రియమైన తెలుగు వారందరికీ నమస్కారం🙏😊

ఈ సంవత్సరం జన గణన రెండు దశలలో ప్రారంభమవుతుంది అన్న విషయం మనకందరికీ తెలిసినదే.

మొదటి దశ అయిన సెన్సస్ తేదీ 7.7.2020 నుండి 30.9.2020 వరకు ఉంటుంది.ఈ-సెన్సస్ ప్రశ్నావళి అంతా ఆన్లైన్ లోనే పూర్తి చేయాలి.

రెండవ దశ అయినా మౌఖిక పద్ధతి ద్వారా పరిగణకులు మలేషియా పౌరుల వద్దనుండి వివరాలు సేకరించడం 7.10.2020 నుండి 24.10.2020 వరకు జరుగుతుంది.

మలేషియాలో ఉన్న తెలుగువారందరూ వ్యక్తిగతంగా గాని మరియు కుటుంబాలు గాని ఈ-సెన్సెస్ పద్ధతినే ఎంచు కోవలసిదిగా అభ్యర్థిస్తున్నాము. ఈ పద్ధతిలో చేసినట్లయితే మనం ఏ సమాచారం అయితే అక్కడ చేర్చామో అది మొత్తం ఖచ్చితంగా ఉంటుంది. దీనివలన మలేషియా గణాంకాల శాఖకు ఖచ్చితమైన సమాచారం చేరుతుంది మరియు తప్పిదాలు చాలా వరకూ తగ్గుతాయి.

ఈ-సెన్సస్ కు ఏ విధంగా లాగ్ ఇన్ కావాలి?
( ఈ క్రింద పేర్కొన్న 8 అంశాలను అనుసరించండి)

 1. మలేషియా గణాంకాల శాఖ తపాలా ద్వారా పంపించే ఆహ్వాన సంగకేతం కోసం వేచి ఉండండి లేదా ఈ క్రింద ఇచ్చిన లంకెలో ఆన్లైన్-సెన్సస్ కోసం ముందస్తు దరఖాస్తు చేసుకోండి.
 2. దయచేసి ఈ వెబ్ సైట్ కు https://ecensus.mycensus.gov.my/ లాగ్ ఇన్ అవ్వండి.
 3. Pendaftaran/Registration మీద నొక్కి మీ పూర్తి పేరు, ఈమెయిల్ అడ్రస్ మరియు మొబైల్ ఫోన్ నెంబర్ నమోదు చేయండి.
 4. ఒకవేళ మీకు ఆహ్వాన సంకేతం ఉన్నట్లయితే YA/YES నొక్కి ఆ సంకేతాన్ని చేర్చండి. ఆ తర్వాత Register/Daftar నొక్కండి.
 5. మీ మొబైల్/ ఈమెయిల్ పంపిన వన్ టైం పాస్ వర్డ్ ద్వారా నమోదు అవ్వండి.
 6. నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ మరియు వచ్చిన వన్ టైం పాస్ వర్డ్ ద్వారా లాగ్ ఇన్ అవ్వండి.
 7. గుర్తింపు కార్డు సంఖ్యను చేర్చండి.
 8. ఇచ్చిన ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వడం కొనసాగించండి.

ఈ-సెన్సస్ పద్ధతిలో జాతికి సంబంధించిన సంకేతాన్ని చేర్చడానికి వీలు లేదు. అక్షరరూపంలో మాత్రమే రాయాలి.

దయచేసి 8వ ప్రశ్న అయిన E8 – APAKAH KUMPULAN ETNIK ANDA/AHLI ISI RUMAH INI ? పరిశీలించగలరు. (దయచేసి నమో నాకు గాని అని గమనించగలరు)

ఈ క్రింది విధంగా రాసి చేర్చండి:-

TELUGU ✅
TELEGU ❌

మౌఖిక పద్ధతిలో జాతికి సంబంధించిన సంకేతాల గురించి మరిన్ని వివరాల కోసం గణాంకాల శాఖ ఇచ్చే సమాచారం కొరకు దయచేసి వేచి ఉండగలరు.

మన సాంస్కృతిక జాతిని వ్యక్తపరచడం జన్మహక్కు. మనమంతా కలిసికట్టుగా తెలుగు సంతతిని మలేషియాలో పెంచడానికి మరియు దృఢమైన సమూహంగా అన్ని అంశాలలో అభివృద్ధి చెందడానికి గానూ నడుం బిగించాలి

దయచేసి కొంత సమయం కేటాయించి ఈ సమాచారాన్ని అని మన సాటి సోదర సోదరీమణులకు తెలియపరచండి. ఈ యజ్ఞంలో ఏ ఒక్క తెలుగువారిని విస్మరించకూడదు.

తదుపరి దశకు సంబంధించి మలేషియా గణాంకాల శాఖ నుండి వచ్చే మరిన్ని వివరాలను మేము త్వరలో మీకు అందజేస్తాము.

#nenutelugu
#mycensus2020

ఆరవ జనగణన గురించి మలేషియా తెలుగు సంఘం వారు అందించే తదుపరి వివరాలు- (భాగం 2)

 1. ఆరవ జనగణన(banci) 2020 అధికారికంగా 7-7-2020 నుండి ప్రారంభించబడింది దయచేసి ఆన్లైన్ ఈ-సెన్సస్ కొరకు ఇక్కడ ముందస్తు నమోదు చేసుకోండి. ఇది పూర్తి భద్రతతో కూడిన సౌకర్యవంతమైన వెబ్ సైటు మరియు వివరాల ఖచ్చితత్వంలో భరోసా కలిగినది.
 2. నమోదు చేసుకున్న అనంతరం, ధ్రువీకరణ కోసం మీకు ఈ మెయిల్ పంపబడుతుంది. ధ్రువీకరణ చేసిన అనంతరం, 72 గంటలలో మీకు ఆహ్వాన సంకేతం ఈ-మెయిల్ ద్వారా పంపబడుతుంది.
 3. ఈ ఆహ్వాన సంకేతంతో ఆన్లైన్లో ఈ-సెన్సస్ కు సంబంధించిన ప్రశ్నావళిని మొత్తం పూర్తి చేయవచ్చు.
 4. మన తెలుగు సోదర సోదరీమణులు అందరినీ ఈ- సెన్సెస్ పద్ధతినే ఎంచుకొని ఖచ్చితమైన వివరాలు అందజేసి తెలుగు వారి యొక్క సరైన జన సంఖ్య ని ప్రభుత్వం వారికి తెలియపరచాలని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాము. ఇది పది సంవత్సరములకు ఒకసారి మాత్రమే జరిగే ప్రక్రియగా గుర్తుపెట్టుకోవాలి.

దయచేసి సమాచారాన్ని దేశంలో ఉన్న మన తెలుగు సోదర సోదరీమణుల అందరికీ పంచుకోవలసిందిగా కోరుచున్నాము.

మనం అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో దృఢంగా నిలబడాలి.

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా💪💪😊

మిక్కిలి అభినందనలతో,

శ్రీ శివ సూర్యనారాయణ
గౌరవ ప్రధాన కార్యదర్శి
మలేషియా తెలుగు సంఘం
చరవాణి : 0166161444
ఈ-మెయిల్ : secretary@telugu.org.my
వెబ్ : www.telugu.org.my
ఎఫ్ బి : fb.com/tammalaysia
ఇన్ష్టా : tammalaysia_official