మలేషియా తెలుగు సంఘం మలేషియా దేశంలో నివసించే తెలుగు సంతతికి చెందిన మలేషియా తెలుగు ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఎటువంటి లాభాపేక్ష లేని ఒక ప్రభుత్వేతర సంస్థ. 17 జూలై 1955న పేరాక్ రాష్ట్రంలోని బాగన్ దత్తో ప్రాంతంలో మొట్టమొదటిగా మలయ ఆంధ్ర సంఘము పేరుతో నెలకొల్పారు.

16 డిసెంబరులో దీనిని మలేషియా ఆంధ్ర సంఘముగా తరువాత 2 అక్టోబరు 1983లో మలేషియా తెలుగు సంఘము()(TELUGU ASSOCIATION OF MALAYSIA)గా పేరు మార్చడం జరిగింది.

మలేషియాలోని 5 లక్షల మంది తెలుగు వారికి ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ మరియు తెలుగు భాషను భావితరాలకు అందేలా కృషి చేయడంలో దేశం మొత్తం 30 శాఖలుగా తెలుగు సంఘం విస్తరించి ముఖ్య భూమిక పోషిస్తున్నది.

వివిధ-వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇతర వ్యాపార వేత్తలైన సంఘంలోని సభ్యులు అంతా ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మలేషియా తెలుగు సంఘం ఉన్నతికి ఎంతో పాటుపడుతున్నారు.

రెండవ ప్రపంచ మహాసభలను సంఘం యొక్క రజతోత్సవాలను 1961 లో నిర్వహించడం మలేషియా తెలుగు సంఘానికి గర్వకారణం, అలాగే 2006లో అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక సభలను తర్వాత సంఘ స్వర్ణోత్సవాలను నిర్వహించడం జరిగింది

తెలుగు వారి ముఖ్య పండుగలైన సంక్రాంతి ఉగాది తెలుగు సంవత్సరాది శ్రీరామనవమి మరియు దీపావళిలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్నది. సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలలో సంగీతం సాహిత్యం చలనచిత్ర రాజకీయ ఈ విధంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తూ సత్కరిస్తూ పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటి

తెలుగు భాషని మరి రక్షించడమే కాకుండా తెలుగు భాషను సంస్కృతిని పెంపొందించేలా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్యా మరియు ఇతర సామాజిక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మలేషియాలోని తెలుగువారిని వారందరిని ఐక్య పరిచే ప్రాధాన్యతను మలేషియా తెలుగు సంఘం యొక్క ముఖ్య లక్ష్యం.

భిన్నజాతులతో విలసిల్లుతున్న మలేషియా దేశంలో తెలుగుజాతి యొక్క హుందాని, గుర్తింపుని స్థిరపరచడం.

తెలుగు భాష పరిరక్షణ మరియు అభివృద్ధి. మలేషియాలోని తెలుగు వారి సామాజిక ఆర్థిక సాంస్కృతిక ఆధ్యాత్మికత మరియు విద్య మొదలగు అంశాలలో ఉన్నతికి కృషి చేయడం, అంతేకాకుండా తెలుగు వారందరూ సౌభ్రాతృత్వంతో మెలుగుతూ సహకార సంఘాలు మరియు ఇతర సంక్షేమ పథకాల ఏర్పాటుకు తగిన ప్రోత్సాహం అందజేయడం.

Music

సంగీతం

Culture

సంస్కృతి

prosperity

సమృద్ధి

education

విద్య

పసుపు : రాజ్యాంగబద్ధ పరిపాలన
నీలం : శాంతి
ఆకుపచ్చ : ఐక్యత
ఎరుపు : నిజాయితీ